తాడేపల్లి: ఐదేళ్లలో వైసీపీ దళితులను మోసం చేసింది

ఏపీ మాల కార్పొరేషన్ ఛైర్మెన్ గా విజయకుమార్ తాడేపల్లి మండలంలో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు గొప్ప అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాంఘిక సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందన్నారు. దళిత సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్ని ఇవ్వకుండా దళితులను వైసీపీ మోసం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్