పల్నాడు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ లావు

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు బుధవారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను ప్రజలందరూ కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకునేటప్పుడు జాగ్రత్తలను పాటించాలన్నారు. చిన్నపిల్లలు, మహిళలు క్రాకర్స్ కాల్చేటప్పుడు దూరంగా ఉండి క్రాకర్స్ ను కాల్చాలన్నారు. కాలుష్యం లేని దీపావళిని నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్