పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నుంచి రైల్వేస్టేషన్ వద్దనున్న పోస్టాఫీస్ వరకు గురువారం ఉదయం "ఏక్తా దివస్" 2కేమ్ పరుగు జరగనుంది. కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఈ పరుగులో పాల్గొంటారని ఎస్పీ కంచి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఉదయం 6. 30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు.