గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామం పీహెచ్సీని డాక్టర్ శ్రావణ్ బాబు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ ఏఎన్ఎంల రిజిస్టర్ తనిఖీ చేసి ప్రతి ఒక్కరు సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఆయన వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేసి గర్భిణీ స్త్రీల నమోదు పెంచాలని ప్రతి బుధవారం వ్యాధి నిరోధక టీకాలు నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆశ యాప్ పై సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు.