ప్రతిపాడు: గురుకుల బాలికల పాఠశాలకు మౌలిక వసతులు కల్పించండి

గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని బాలికల గురుకుల పాఠశాలకు త్రాగునీరు వసతితో పాటు ప్రహరీ గోడ నిర్మించాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలానే అడవి తక్కెళ్ళపాడులోనీ బాలుర గురుకుల పాఠశాలలో మంచినీరు వసతిని కోరారు. ఆలూరు తదితర వసతి గృహాలలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్