యడ్లపాడు మండలం దింతెనపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా బస్సు షెల్టర్, అంతర్గత రహదారులు, సైడు కాలువల నిర్మాణాలను రూ. 14 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.