భట్టిప్రోలు మండల పరిధిలోని పెసర్లంక గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య పరీక్షా శిబిరాన్ని.. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్ పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వైపిరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత యన్నం సురేష్ తన సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఈ శిబిరం ద్వారా 216 మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.