వినుకొండలో రూ. 10లక్షల విలువైన బయో ప్రొడక్ట్స్ సీజ్

వినుకొండ పట్టణంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాలతో శుక్రవారం ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమతులు లేని, అనధికారికంగా ఒక గౌడౌన్లో నిల్వ ఉంచిన సుమారు రూ. 10లక్షల విలువైన బయో ప్రొడక్ట్స్ ను సీజ్ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. వీటితో పాటు రూ. 4లక్షలు విలువైన 20 టన్నుల ఎరువులు అమ్మకాలను నిలుపుదల చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్