వినుకొండ ప్రాజెక్టు పరిధిలోని నాగులవరం అంగన్వాడీ స్కూలులో శుక్రవారం పోషకాహార మాసోత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ శ్రీలత అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారంతో రక్తహీనతను నివారించవచ్చని ముఖ్యంగా గర్భిణీలకు, బాలింతలకు, ఎదిగే పిల్లలకు ప్రభుత్వము పౌష్టికాహారాన్ని అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా లు పాల్గొన్నారు.