పారిశుధ్య పనులు సక్రమంగా జరగాలి: కమిషనర్

చిత్తూరు నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కమిషనర్ మిట్టూరు మస్టర్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మస్టర్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు తనిఖీ చేశారు. వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని, పనుల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించరాదన్నారు.

సంబంధిత పోస్ట్