కుప్పం: గంగమ్మ ఆలయంలో టీడీపీ నేత ప్రమాణం

గంగమ్మ సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేసినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా అంటూ కుప్పం టీడీపీ నేత గోపీనాథ్ గంగమ్మ ఆలయంలో ఆదివారం ప్రమాణం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వైసీపీ నేతల వద్ద డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నేడు ఆయన కొత్తపేట శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో ప్రమాణం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డులో గోపీనాథ్ తనయుడు హర్ష పోటీ చేసి ఓడిపోయాడు.

సంబంధిత పోస్ట్