వికోట మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. క్రికెట్ ఆడుతుండగా బంతి ఓ మహిళకు తగలడంతో ఘర్షణ మొదలైంది. దీనిపై ఆమె భర్త క్రికెట్ ఆడుతున్న వారిని ప్రశ్నించగా యువకులకు సంబంధించిన వర్గీయులు బాధ్యత కుటుంబం దాడి చేసి ఐదుగురిని గాయపరిచారు. ఈ క్రమంలో బాధితులకు మద్దతుగా దాడికి పాల్పడిన వారిని ప్రశ్నించేందుకు వెళ్లగా మరోసారి దాడి చేశారు. ఈ ఘటనలో పలమనేరు డీఎస్పీకి గాయాలయ్యాయి.