పుంగనూరు పట్టణ పరిధిలోని పలమనేరు రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం మలుపు వద్ద ఆదివారం రోడ్డుపై నడిచి వెళ్తున్న పద్మావతమ్మను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు హుటాహుటిన బాధితురాలిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు 108 వాహనం ద్వారా ఆమెను మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.