చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మొండి బకాయి దారులకు మున్సిపల్ అధికారులు షాక్ ఇస్తున్నారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని సూర్య నగర్ లో ఓ ఇంటి యజమానికి నోటీసులు ఇచ్చిన పట్టించుకోకపోవడంతో కమిషనర్ మధుసూదన్ ఆదేశాల మేరకు కుళాయి కనెక్షన్ ను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ.. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని తెలియజేశారు.