చిన్నపాటి వర్షానికే వీధుల్లోకి నీరు

పెదపూడి మండలం దోమడ గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక ఎస్సీ పేట ఏరియాలో చిన్నపాటి వర్షానికే సిమెంట్ రోడ్లు జలమయం అవుతున్నాయి. ఎస్సీ పేట రామాలయం రోడ్ లో డ్రైనేజీ లేక వర్షపునీరు రోడ్డుపై నిలిచిపోతుందని తద్వారా నడవడానికి ఇబ్బందిగా మారిందని అక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్