వంద పడకల ఆసుపత్రికి పెంపుదల

పెద్దాపురం ఏరియా ఆసుపత్రిని భవిష్యత్తులో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి పరచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం కోరుతూ కృషి చేస్తున్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప చెప్పారు. పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. చైర్మన్ హోదాలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ రూ. 7. 50 కోట్లతో ఆసుపత్రి భవనం చేపట్టగా ఒక మంచి షెల్టర్ ఏర్పడిందన్నారు.

సంబంధిత పోస్ట్