మంత్రి నానిని బర్తరఫ్ చేయాలి: పెయ్యిల రాంబాబు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెయ్యిల రాంబాబు కోరారు. ఈ సందర్భంగా గురువారం ద్రాక్షారామలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని..దేవాలయాలపై దాడులు వెనుక కుట్ర కనబడుతోందన్నారు. మంత్రి నాని వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం వార్తలు గా పరిగణించే పరిస్థితి కనబడుతోందన్నారు. మంత్రిపై తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ ప్రజా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్