బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యునిగా పెయ్యిల రాంబాబు

జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ అమలాపురం పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన రాంబాబు బుధవారం అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 2005 నుంచి పార్టీలో సభ్యునిగా కొనసాగుతున్నానని 2008లో యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా, 2014 జిల్లా జనరల్ సెక్రెటరీ గా, 2018 ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. ఆయన సేవలను పార్టీ గుర్తించి అమలాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ.. వేమ రాంబాబుని జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు సోము విర్రాజు, కర్రీ చిట్టిబాబు, దూడల శంకర్ నారాయణ, రోక్కల సత్తిబాబు లకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్