ప. గో జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు అభినందనలు వెల్లువెత్తాయి. గురువారం నరసాపురంలోని ప్రసాదరాజు నివాసానికి విచ్చేసి పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు.