ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే సోమవారం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్ హాల్లో నిర్వహించే గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు అందించవచ్చన్నారు. గ్రీవెన్స్ డేలో అందిన సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.