ఓ వ్యక్తిపై కర్రతో దాడి చేసిన ఎనిమిది మందిపై నగరంపాలెం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు పొన్నూరుకు చెందిన రవి కిరణ్ తన భార్య పిల్లలను గుంటూరులోని సోదరుడు రవికుమార్ ఇంటికి పంపించారు. రోజులు గడుస్తున్నా తిరిగి పొన్నూరుకు భార్య పిల్లలను పంపించలేదు ఎందుకని రవికిరణ్ తన స్నేహితులను తీసుకువచ్చి కర్రతో దాడి చేశారని బాధితుడు రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.