బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెనాలి మండల తహశీల్దార్ కెవి గోపాలకృష్ణ చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున బియ్యం, నిత్యావసరాలను రూరల్ గ్రామాలు కొలకలూరు, అంగలకుదురు, కోపల్లె గ్రామాలలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ పంపిణీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్