తాండవకు పోటెత్తిన వరద ఉధృతి

చాలా ఏళ్ల తర్వాత తాండవకు వరద పోటెత్తింది. గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా రమారమి పూర్తిస్థాయిలో నీటి నిల్వలు 379. 40 అడుగులకు చేరడంతో స్పిల్ వే కాలువలకు 8, 931 క్యూసెక్కులను విడుదల చేసినట్లు డీఈ పి. అనురాధ తెలిపారు. సోమవారం రాత్రి 8గంటలకు కుమ్మరిలోవ రోడ్డుపైకి నీరు చేరింది. రెల్లిపేటలో పాకలు నీట మునగడంతో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు.

సంబంధిత పోస్ట్