కోనసీమ జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్, గ్రామీణ జలజీవన్ మిషన్ పథకం పనులు అమలు కోసం జిల్లా నీరు, పారిశుద్ధ్య మిషన్ పేరిట కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగపు సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఆయన అమలాపురంలో మీడియాకు శనివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ కమిటీకి కలెక్టర్ మహేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఉంటారన్నారు.