అల్లవరం మండలం బోడసకుర్రులో అమలాపురం పట్టణ వాసుల కోసం నిర్మించిన టిడ్కో గృహాల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన తెలిపి, జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ ఫ్లాట్లో బోర్ వాటర్, తాగునీరు అందట్లేదన్నారు. ప్లాట్ల రుణాలను రద్దు చేయాలని కోరారు.