అమలాపురం: మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన

అమలాపురం రూరల్ బండారులంక ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో దివ్యాంగుడు జుత్తుక శ్రీనివాసరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శ్రీనివాసరావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగారపు పరశురాముడు ఆధ్వర్యంలో అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్