ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి జ్యోతిలక్ష్మీదేవి శుక్రవారం తెలిపారు. గతంలో రెండు పర్యాయాలు డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి, దాదాపు 50 శాతం మంది ఉద్యోగాలు సాధించిన సంస్థలకు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హత ఉందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 21 వరకు గడువుందని ఆమె తెలిపారు.