అమలాపురం రూరల్: బండారులంక డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలి

అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఉప సర్పంచ్ కామిశెట్టి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు అంకం హేమ భారతి, గుత్తుల లక్ష్మీ కుమారీ కోరారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్