గోపాలపురం: ఆటో డ్రైవర్ కు జిల్లా ఎస్పీ సత్కారం

రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్ కేసులో దేవరపల్లికి చెందిన కోటేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించి, బాలికలను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పజెప్పడంలో సహాయపడ్డాడు. దీంతో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆటో డ్రైవర్ ను మంగళవారం ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ప్రతి ఒక్కరు ఈ ఆటో డ్రైవర్ ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్