హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరు చిట్కుల్ రాధమ్మకాలనీకి చెందిన వైద్యుడు కిరణ్ ఇంటిలో మే 28న చోరీ జరిగింది. 20 తులాల బంగారం చోరీ చేసింది పాత నేరస్థుడు దుర్గాప్రసాద్ పోలీసులు గుర్తించారు. నిందితుడిని యానాం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శామ్యూల్ రాజ్ అనే నిందితుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. రిమాండ్ కు తరలించారు. అతను 60 చోరీల కేసుల్లో నిందితుడని పోలీసులు శుక్రవారం తెలిపారు.