ముమ్మిడివరం మండలంలో కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటికీటలాడాయి. నగర పంచాయతీ పరిధి మూడవ వార్డు పల్లిపాలెంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం శనివారం వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భారీ క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ వారి ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.