వాలంటీర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని తాళ్ళరేవు మండల వాలంటీర్లు కోరారు. శుక్రవారం తాళ్లరేవులో వాలంటీర్లు మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచుతామని, తమను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఆ హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 4 తేదీన ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తామన్నారు.