తప్పిపోయిన బాలుడు కుటుంబం చెంతకు చేరిక

తిరుపతి జిల్లా, వెంకటగిరికి చెందిన ఎస్కే మస్తాన్ ఇంటి నుంచి తప్పిపోయి సామర్లకోట రైల్వేస్టేషన్ చేరాడు. అక్కడ బాలుడు అనుమానాస్పదంగా జిఆర్పి పోలీసులకు కన్పించాడు. ఆ బాలుడిని ప్రశ్నించగా తాను ఇంటి నుంచి తప్పిపోయి వచ్చానని, తన పేరు ఎస్ కె. మస్తాన్ అని, తండ్రి పేరు ఎస్ కె. జమీల్ అని వివరించాడు. దీంతో జిఆర్పి ఎస్ఐ బి. లోవరాజు సోమవారం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం తెలిపి బాలుడిని అప్పగించారు.

సంబంధిత పోస్ట్