సీతానగరం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంను అధికారులు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ పాల్గొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.