కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. కందిని పూత పెంకు పురుగు ఆశించి మొగ్గలను తింటాయి. వీటిని ఉదయం పూట ఏరి మంటలో కాల్చివేయాలి. మారుకమచ్చల పురుగు నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్, ఒక మి.లీ. డైక్లోరోవాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకుచుట్టు పురుగు నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్ 2.మి.లీ. చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేయాలి.