కోటిపల్లి పంటు రేవు ప్రయాణం 15 నుంచి పునరుద్ధరణ

రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కోటిపల్లి గోదావరి పంటు రేవు ప్రయాణం శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి పెరగడంతో పంటు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల మళ్లీ పంటు ప్రయాణాన్ని పునరుద్ధరిస్తున్నారు. కోనసీమ ప్రాంతం నుండి కాకినాడ వైపు వెళ్ళు ప్రయాణికులు అధిక సంఖ్యలో పంటు పై ప్రయాణిస్తారు.

సంబంధిత పోస్ట్