రామచంద్రపురం: కోటిపల్లి రేవులో పంటు ప్రయాణంపై ఆర్డీవో సమీక్ష

కె. గంగవరం మండలం కోటిపల్లి రేవు బాటను రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల మంగళవారం పరిశీలించారు. ప్రయాణికులకు పంటు సౌకర్యం ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకు వస్తారన్న అంశంపై ఆమె సమీక్షించారు. ఈ నెల 15వ తేదీ శుక్రవారం నుంచి పంటు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ఆమె వెంట ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బేబీ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్