రాజోలులో అభివృధి పనులకు శంకుస్థాపన

రాజోలు మండల ప్రజా పరిషత్ నిధులతో మండలంలోని వేగివారిపాలెం, తాటిపాక గ్రామాలలో నూతన సీసీ రోడ్లు నిర్మాణ పనులకు బుధవారం ఎంపీపీ కేతా శ్రీనివాస్ శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండల పరిషత్ నిధులతో గ్రామాలలో అధ్వానంగా మారిన రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలో మిగిలిన గ్రామాలలో కూడా రోడ్లు నిర్మిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్