రాజోలు: 22 కుటుంబాలకు సీఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయం

రాజోలు నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 22 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 17 లక్షలు మంజూరయ్యాయని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం తెలిపారు. మలికిపురంలో సోమవారం జరిగే కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ఈ చెక్కులు అందజేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్