రాజోలు: కుంగిన రోడ్డుకు మరమ్మతులు చేయాలి

రాజోలు మండలంలోని బి. సావరం నుంచి చింతలపల్లి గ్రామానికి వెళ్లే ఆర్&బీ రోడ్డు పలు చోట్ల కుంగి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువ పక్కన రోడ్డు కుంగడం జరిగిందని స్థానికులు ఆదివారం చెప్పారు. రాత్రి సమయంలో రోడ్డు కుంగిన చోట వాహనలు అదుపు తప్పి కాలువలోకి వెళ్లే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు స్పందించి రోడ్డు కుంగిన చోట మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్