కాకినాడజిల్లా తుని తాండవ నది పరివాహక ప్రాంతంలో కొలువైన సచ్చిదానంద తపేవన ఆశ్రమ పీఠాధిపతులు సరస్వతి స్వామి వారు విజయవాడ ఇంద్ర కీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న స్వామీజీకి వేద పండితులు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి విశిష్టత భక్తులకు సైతం స్వామీజీ అనుగ్రహబాషనం చేశారు.