తొండంగి: సముద్ర స్నానానికి దిగి వ్యక్తి గల్లంతు

కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని పెరుమాళ్లపురంలో సముద్ర స్నానానికి దిగిన వ్యక్తి గల్లంతయ్యాడు. బిహార్ కు చెందిన వినయ్ కుమార్ గుప్తా శుక్రవారం తన సహోద్యోగులతో కలిసి పెరుమాళ్లపురం తీరానికి వెళ్లాడు. గుప్తా గల్లంతవ్వడంతో అక్కడి మత్స్యకారులకు సమాచారం అందించారు, కానీ అతనికి సంబంధించిన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్