నందిగామ పట్టణం రైతుపేటలోని ఓసి. క్లబ్ లో సోమవారం బాలల చట్టాలపై అవగాహన సదస్సును ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ భాగ్య రేణుక, స్థానిక శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు ఇష్టమైన శాఖలలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒకటి, మహిళలే ముందుండి ఈ వ్యవస్థను నడిపిస్తారు. బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.