దెబ్బతిన్న బ్రిడ్జి పరిశీలించిన అధికారులు

వర్షాల కారణంగా దెబ్బతిన్న జగ్గయ్యపేట - వైరా రోడ్డును జాతీయ రహదారిగా మార్పులకు కృషి చేస్తున్నట్లు టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ తెలిపారు. మునేటికి వచ్చిన వరదల కారణంగా ఈ రహదారిలోని వత్సవాయి మండలం లింగాలలో ఉన్న దెబ్బతిన్న మునేటి బ్రిడ్జిని సోమవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ బ్రిడ్జి మీద కాలినడకనే ప్రయాణిస్తూ ఈ బ్రిడ్జి దెబ్బతిన్న తీరును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్