న్యాయ వ్యవస్థకు వన్నె తెచ్చిన వ్యక్తి జస్టిస్ అంబటి

న్యాయ వ్యవస్థకు వన్నె తెచ్చిన ఆదర్శప్రాయులు జస్టిస్ అంబటి లక్ష్మణరావు అని ఏపీ పూర్వ న్యాయమూర్తి జస్టిస్ శంకర్ పేర్కొన్నారు. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో బుధవారం జస్టిస్ అంబటి లక్ష్మణరావు సంస్మరణ సభ నిర్వహించారు. శంకర్ మాట్లాడుతూ లక్ష్మణరావు వివాదాలకు దూరంగా వృత్తి ధర్మాన్ని నిర్వహించారని కొనియాడారు. పదవీ విరమణ తర్వాత ఏ విధమైన గుర్తింపు కోరుకోకుండా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్