గుంటూరు పశ్చిమ 25వ డివిజన్లో రూ. 2. 33కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగా వెనుకబడిన డివిజన్ల అభివృద్ధి కోసం తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.