రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: రాము

వినుకొండ మండలం, శివాపురం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయించి ఐదు వేల ఎకరాల సాగు భూమిని బీడు భూములు కాకుండా కూటమి ప్రభుత్వం ఆయకట్టు రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రాము అన్నారు. శుక్రవారం వినుకొండలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వారు నిరసన పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ. పల్నాడు జిల్లా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్