వరద నష్టంపై ఆర్పీ సిసోడియా కీలక ఆదేశాలు

ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైందని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లాలో 21 సెంటిమీటర్ల పడాల్సి ఉండగా 34.5 సెం.మీ. వర్షం పడిందని చెప్పారు. ఏడు జిల్లాలో వర్షాలు బాగా కురిశాయని అన్నారు. 11.35 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణానదికి వచ్చిందని తెలిపారు. బుడమేరుకు ఏడు వేల నుంచి 35 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. మూడు గండ్లు పడటంతో విజయవాడ భారీ వర్షాలకు దెబ్బతిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్