కోవూరు బాలికల పాఠశాల లో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ లో రాష్ట్ర స్థాయిలో జరిగే బాక్సింగ్ పోటీల కొరకు జిల్లా స్థాయి క్రీడాకారులు సెలెక్షన్స్ సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు బాగా ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో సత్తా చాటి జిల్లాకు ఎక్కువ పథకాలు సాధించాలన్నారు.