గార్లదిన్నె: రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం భరోసా కల్పించారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్